
జనం న్యూస్ 01 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్గ్రా మాలలో వి పి ఓ అధికారులు రౌడీ షీటర్స్, సస్పెక్ట్ ల నిఘా ఉంచడం తో పాటు గ్రామాలలో ఎలాంటి సమాచారం అయిన తెలుసుకొని ఉండాలి పిర్యాదుదారుల పాజిటివ్ స్పందనే పోలీస్ పనితీరును తెలియజేస్తుంది ఆ దిశగా పోలీస్ అధికారులు మరింత బాధ్యత తో విధులు నిర్వహించాలి వార్షిక తనిఖీలలో భాగంగా అలంపూర్ పోలీస్ స్టేషన్ ను ఇన్స్పెక్షన్ చేసిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఐ.పి.ఎస్ పిర్యాదుదారుల నుండి వచ్చే పాజిటివ్ స్పందనే పోలీస్ పని తీరుకు నిదర్శనంగా నిలుస్తుందని ఆ దిశగా పోలీస్ అధికారులు సిబ్బంది మరింత బాధ్యత తో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఐ.పి.ఎస్ అధికారులకు సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ బుధవారం అలంపూర్ పోలీసు స్టేషన్ ను సందర్శించి సిబ్బంది యూనిఫామ్ టర్న్ ఔట్ స్టేషన్ రికార్డ్స్ పరిసరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అలంపూర్ పోలీస్ స్టేషన్ లో వందనం స్వీకరించిన అనంతరం స్టేషన్ పరిసరాల శుభ్రత సిబ్బంది బ్యారక్స్ స్టేషన్ రికార్డుల మెంటేనేన్స్ ను పరిశీలించారు. సిబ్బంది కిట్ ఆర్టికల్స్ తనిఖీ చేస్తూ కిట్ ఆర్టికల్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్వాధీనం చేసుకున్న కేసులో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డు లను తనఖీ చేస్తూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును చేయాలని ఆస్థి సంబంధిత నేరాలకు సంబంధించి, అధిక నేరాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్స్ గా గుర్తించి, పగలు రాత్రి బీట్ డ్యూటీల ద్వారా నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఆంధ్ర సరిహద్దు పోలీస్ స్టేషన్ గా ఉన్నందున ఎలాంటి ఇల్లీగల్ రవాణా జరుగకుండా చెక్ పోస్ట్ ల దగ్గర పటిష్ట నిఘా ఉండాలని ఎస్సై రామకృష్ణ కు సూచించారు. రిసీప్షన్ సిబ్బంది స్టేషన్ కు వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ లో నమోదు చేయాలని, ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడాలని అన్నారు. వి పి ఓ అడిగికారులు గ్రామాలపై పూర్తి అవగాహనా ఉండాలని రౌడీ షిటర్స్ సస్పెక్ట్ ల పై నిఘా ఉంచాలని, మరియు గ్రామాలలో తిరుగుతూ ప్రజలతో మమేకం అవ్వాలని, తద్వారా గ్రామాలలో ఎలాంటి సమాచారం కావాల్లన్న ముందస్తుగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. గ్రామాలలో అనుమానిత వ్యక్తులను పాపిలోన్ డివైస్ ను వినియోగించి వేలిముద్రాలను చెక్ చేస్తూ పాత నేరస్తులను గుర్తించాలని అన్నారు. నేరాల అదుపులో జరిగిన నేరాలను ఛేదించడంలో ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ ప్రజలే స్వచ్ఛందంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పార్కింగ్ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు.స్టేషన్ రికార్డులైన పార్ట్ 1 - 5 పెండింగ్ లేకుండా చూడాలని సిబ్బందికి వర్టికల్ వారీగా విధులను కేటాయించాలని ఎస్.హెచ్.ఓ కు సూచించడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు, సైబర్ నేరాల నివారణకు వివిధ స్కూల్స్ కళాశాలలు, పని ప్రదేశాలలో కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి రోజు వాహానాల తనిఖీ నిర్వహిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటించని వాహణదారులపై చర్యలు తీసుకోవాలని, అనుమానిత వాహనాలను అదుపులోకి తీసుకోవాలని అన్నారు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది ప్రతి పాయింట్ ను తనిఖీ చేయాలని, డైల్ -112 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలని సూచించారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ అందుబాటులోకి తీసుకువచ్చిన సీసీటీఎన్ఎస్ - 2.0 పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్ఆర్ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ, సీడీఆర్, సిఇఐఆర్ పోర్టల్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్, బాడీ ఓన్ కెమెరాల వంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్లు నేరాల అదుపునకు, జరిగిన నేరాలను ఛేదించడానికి ఉపయోగకరంగా ఉన్నాయని, అన్ని అప్లికేషన్లపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహించాలని సిబ్బందికి సూచించడం జరిగింది ఇప్పుడు నేర్చుకున్న పని మీ సర్వీస్ మొత్తం ఉపయోగపడుతుందన్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వాహణలో అంకిత భావంతో పని చేయాలని. ఎవరికీ కేటాయించిన విధులను వారు సక్రమంగా నిర్వర్తించినప్పుడే పోలీసు శాఖకు మంచి పేరు వస్తుందని అన్నారు. డ్యూటీ పరంగా లేదా వ్యకిగతంగా ఎలాంటి సమస్య ఉన్న నేరుగా నా దృష్టికి తీసుకురావొచ్చు అన్నారు. ఓకే చోట పని చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ లాగా కలిసి మెలసి ఉండాలని పాజిటివ్ ఆలోచనలతో పని చెయ్యాలని అన్నారు. ప్రజలు పోలీస్ యూనిఫామ్ కు ఎంతో ఇస్తారో అంతే తో బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్నారు. విధులను, పర్సనల్ లైఫ్ ను బాలన్స్ చేసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఈ తనిఖీలలో ఎస్పీ వెంబడి డి.ఎస్పీ వై. మొగిలయ్య, అలంపూర్ సిఐ ప్రదీప్ అలంపూర్ ఎస్సై రామకృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పి. ఆర్. ఓ. జిల్లా పోలీస్ కార్యాలయం, జోగుళాంబ గద్వాల్ జిల్లా.