
జనం న్యూస్ అక్టోబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గం లో కూకట్ పల్లి లో రామ్ దేవ్ రావు హాస్పిటల్ సీఈఓ యోబు ఆహ్వానం మేరకు నేడు వీకేఆర్ ట్రస్ట్ బ్లడ్ క్యాంపు కార్యాలయంలో జనసేన తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, స్వయంగా పాల్గొని రక్తదానం చేసిన యువకులను, జనసైనికులను అభినందించారు.
ఈ సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమకుమార్ మాట్లాడుతూ సమాజంలో అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి ఈ రక్తదాన శిబిరాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొల్లా శంకర్ ,వేముల మహేష్,గోపి కృష్ణ, వీర మహిళ శిరీష , హాస్పిటల్ మేనేజర్ కల్పన మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.