
జనం న్యూస్ 01 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్అ సెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకు పంపాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన వికలాంగుల రౌండ్ టేబుల్ సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్అ సెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం రేవంత్ రెడ్డిని వికలాంగుల హక్కుల చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బి వి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వికలాంగుల సమస్యలపై సోషల్ జస్టిస్ పార్టీ నిర్వహించిన వికలాంగుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ వికలాంగుల సమాజానికి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 6000 లకు పెంచుతామని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని వికలాంగుల సమాజాన్ని నమ్మించి వికలాంగుల ఓట్లను వేయించుకుని అధికారంలోకి వచ్చిన నాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మూడేళ్ల పరిపాలనలో అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణ వికలాంగుల సమాజంపై అడుగడుగున వివక్ష ప్రదర్శిస్తూ ఎన్నికల సమయంలో తన పార్టీ మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలనే మర్చిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసిక వికలాంగుడిలా ప్రవర్తిస్తున్న తీరు బాధాకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన తీరు మార్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు పారాలింపిక్స్-20024లో సత్తాచాటిన యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్రంలో వికలాంగుల క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా వికలాంగుల క్రీడాకారులకు ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వికలాంగులందరినీ పర్మినెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ఉన్న ఐదు శాతం రిజర్వేషన్ 100 శాతం కు పెంచి వివాహంతో సంబంధం లేకుండా ఆసరా పింఛన్ వచ్చే ప్రతి వికలాంగునికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగుల రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు చేయించలేని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం బర్తరప్ చేయించాలని ముఖ్యంగా రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించలేని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పి వెంటనే వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మన్ కుమార్ ను వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడినే మంత్రిగా నియమించేలా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వికలాంగుల సంఘాలు ఐక్య ఉద్యమాలతో తమ పోరాటాలను ఉదృతం చేస్తామని వెల్లడించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న పలు వికలాంగుల సంఘాల ప్రతినిధులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ జస్టిస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.