
బిచ్కుంద అక్టోబర్ 2 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బిచ్కుందలోని గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలను, ఆయన చూపిన అహింసా మార్గాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండలానికి చెందిన BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు.