
విద్యా వ్యవస్థ బలోపేతానికి సమష్టి కృషి అవసరం: యల్ల టూరు జనం న్యూస్ నందలూరు అక్టోబర్ 2
కడప జిల్లా పాటూరు జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ డేవిడ్ కళ్యాణ్ రాజ్‌కు ఘన సన్మానం పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిం చాలని రాజంపేట పార్ల మెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు పిలుపు నిచ్చారు. నందలూరు మండలం పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన డేవిడ్ కళ్యాణ్ రాజ్నుగురువారం స్థానిక యల్లటూరు భవన్లో యల్లటూరు శ్రీనివాస రాజు ఘనంగా సన్మానిం చారు.ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి విద్యా కమిటీలు కీలక పాత్ర పోషించాలన్నారు. కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యత నిస్తూ పాఠశాలల అభి వృద్ధికి చర్యలు చేపడు తోందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచు కునిఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యాకమిటీసభ్యులు సమన్వయంతో పనిచే యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివ ప్రసాద్, మాజీ ఎంపీటీసీ మాడపూరి శ్రీరాములు, రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, సమాజ సేవా సమితి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మెహర్ ఖాన్ తదితరులు పాల్గొ న్నారు.