
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సూచనలతో చర్యలు జనం న్యూస్ సెప్టెంబర్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని వివేకానంద నగర్ కాలనీ ప్రధాన రహదారిపై ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు శుభ్రత పనులు చేపట్టారు. ప్రధాన రహదారిపై పేరుకుపోయిన మట్టి కుప్పలు, రాళ్లు, చెత్తాచెదారాన్ని తొలగించి రాకపోకలకు సౌకర్యం కల్పించారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ అరికెపూడి గాంధీ రహదారిపై ఉన్న మట్టి కుప్పలు, రాళ్లను తొలగించాలని రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డికి సూచించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు పురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, రాళ్లు, చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రధాన రహదారిపై పేరుకుపోయిన మట్టి, రాళ్లు, చెత్తను తొలగించినట్లు తెలిపారు. ఆటో ప్రయాణికులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాకపోకలకు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆటోలు ప్రధాన రహదారిపై నిలిపివేయకుండా రహదారి లోపల నిర్దేశిత ప్రదేశంలో నిలిపివేయాలని ఆటో కార్మికులకు సూచించారు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొని రహదారిపై ఉన్న రాళ్లు, మట్టి కుప్పలను.