
జనం న్యూస్, సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని తెలిపారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, షోయబుల్లాఖాన్, దాశరథి కృష్ణమాచార్య తదితరులు పోరాడారని పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో సైనిక చర్య అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీన మైందన్నారు.సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ తరఫున ప్రతి సంవత్సరం అధికారులకు వినతులు ఇస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, నాటి పోరాటాలు, త్యాగాల చరిత్రను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు.కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఘనశ్యాం, విఠల్, వంశీ, కిరణ్, సంజయ్, శ్రీనివాస్, రత్నయ్య, మహేష్, మారుతి, ప్రసాద్, కూరాకుల శ్రీనివాస్, సంతోష్, నరేష్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.