
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్. 17. 09. 2026 జహీరాబాద్ నియోజకవర్గం జర సంఘం మండలంగిన్నియార్పల్లి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామ పెద్దలు, యువకులు
గిన్నియార్పల్లి గ్రామంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, విమోచన దినోత్సవ ప్రాధాన్యతను పలువురు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో గిన్నియార్పల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్, గ్రామ కార్యదర్శి రాజు, డిప్యూటీ సర్పంచ్ యాసీన్ అలీ, వార్డు సభ్యులు దత్తు రెడ్డి, ఎల్లప్ప, మాజీ ఎంపీటీసీ హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, యువకులు, స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఐక్యత, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో నిర్వహించిన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.