
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 02-10-26 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో 2026 అక్టోబర్ 2వ తేదీన రిఫార్మ్ ఉత్సవ్ 2026 అనుసంధా నంతో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.దీనికి అనుగుణంగా, నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచా యతీలో శుక్రవారం నాడు నిర్వ హించిన గ్రామసభ, కూటమి పార్టీల సభను తలపించిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ జన విభాగం నాయకుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి విమర్శించారు.ఈ ప్రత్యేక గ్రామసభలు పౌరుల భాగస్వామ్యంతో సమగ్రంగా నిర్వహించాల్సిందిపోయి, మేజర్ పంచాయతీలోని ప్రజలు ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, కేవలం కూటమి పార్టీ నాయకులతో వేదిక పంచు కుని, తూతూ మంత్రంగా గ్రామ సభ నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని ఆయన మండ లంలోని అధికారులను ప్రశ్నించారు???ప్రజాసేవలు మెరుగుదల మరియు పౌర కేంద్రీత సంస్కరణలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించ డంలో, ప్రభుత్వ సేవల లభ్యత లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోని వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో పూర్తిగా మండలాధికారులు విఫలమయ్యారని ఆయన ఘాటుగా విమర్శించారు.
ఇప్పటికైనా సంబంధిత మండలాధికారులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని వారి యొక్క సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద లూరు మండల పంచాయతీ రాజ్ వింగ్ అధ్యక్షులు ముమ్మడి శెట్టి సుధాకర్ మరియు తది తరులు పాల్గొన్నారు.