
మున్సిపల్ చైర్ పర్సన్ సీమ షెట్కార్బి చ్కుంద అక్టోబర్ 2 జనం న్యూస్జా తిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం రోజు బిచ్కుంద మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ సీమా సెట్కార్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్ఈ సందర్భంగా మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ ఆశద్ అలీ మాట్లాడుతూ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన త్యాగాలు, అహింసా మార్గం, సత్యనిష్ఠ దేశ ప్రజలకు ఎప్పటికీ ఆదర్శనీయమని అన్నారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సౌభ్రాతృత్వ మార్గాల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ కలలుగన్న సమానత్వం, సామాజిక న్యాయం, ఐక్యతతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో, చైర్మన్ తో పాటు కౌన్సిలర్ నౌషా నాయక్ కౌన్సిలర్ శ్యామల కార్తిక సంతోష్ కాప్షన్ నెంబర్ అసాద్ అలీ హనుమాన్లు కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.