
నాళ్ల ఆదినారాయణ (చిన్ని) ఆదేశాలతో పనులు. గ్రామస్తుల హర్షం జనం న్యూస్ అక్టోబర్ 2 కోటబొమ్మాళి :మండలంలోని కరుడు పంచాయతీ పరిధి పాకివలస గ్రామంలో పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు నాళ్ల ఆదినారాయణ (చిన్ని) ఆదేశాల మేరకు పారిశుధ్య పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోని మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పంచాయతీ ప్రత్యేక అధికారి, తహసీల్దార్ సిహెచ్. ప్రసాదరావు , ఎంపీడీవో కిల్లారి నారాయణరావుసూచనల మేరకు పారిశుధ్య పనులు చేపట్టారు. టీడీపీ ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు చింతల సింహాచలం పర్యవేక్షణలో మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పారిశుధ్య పనులు చేపట్టడంతో గ్రామంలో మురుగునీటి సమస్యకు కొంత ఉపశమనం లభించిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.