
జనం న్యూస్ అక్టోబర్03 ముమ్మిడివరం ప్రతినిధి న _మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తాళ్లరేవు మండలంలో డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, పచ్చదనం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, స్వయం సమృద్ధి గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని బిజెపి అధ్యక్షులు కోరారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ బీజేపీ ఆఫీస్ ఇంచార్జ్ దాట్ల సుబ్బరాజు, చెరుకూరి గోపాలకృష్ణ (సిద్ధాంతి ) తదితరులు పాల్గొన్నారు.