
జనం న్యూస్, అక్టోబర్ 03 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం, 25ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా కె. గంగవరం మండలంలోని కె. గంగవరం, పామర్రు, సత్యవాడ హైస్కూల్స్ లో నిర్వహించిన వికసిత్ భారత్ -2047 అంశంపై చిత్రలేఖనం, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సేవా సేతు జిల్లా కన్వీనర్ అవసరాల వెంకటరమణమూర్తి మాట్లాడుతూ సెప్టెంబర్17నుండి అక్టోబర్ 17వరకు సేవా సంకల్ప్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. 13ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12ఏళ్లు ప్రధానిగా మోదీ అవినీతి రహిత పాలన అందిస్తూ స్వదేశీని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు కాదా వీరవెంకటరమణ, మండల బిజెపి అధ్యక్షుడు కొప్పిశెట్టి చంద్రరావు, మండల ప్రధాన కార్యదర్శి అవసరాల నారాయణమూర్తి, బివిబిఎల్ నారాయణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిని లిల్లీ, విద్యార్థులు పాల్గొన్నారు.