
జనం న్యూస్ అక్టోబర్ 3 కోటబొమ్మాళి మండలం :మండలం శ్రీ జగన్నాధపురం పంచాయతీ వెల్లంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వితరణలు వెళ్ళువెత్తాయి. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బలగ మురళి 50 వేల రూపాయలు, మాజీ సర్పంచ్ నూక సత్యరాజు 50 వేల రూపాయలు, స్థానిక డి.సి.సి మెంబర్, సీనియర్ దేశం నేత 30 వేల రూపాయలు పాఠశాలకు వితరణగా ఇచ్చారు. పాఠశాల అభివృద్ధి కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయాలని, నిరుపేద విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు ఇతర సామాగ్రి వంటివి కొనిపెట్టాలని వారు సూచించారు. ఈ మొత్తాన్ని వారు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్జంగి మాజీ సర్పంచ్ అన్యపు రామారావు, దుద్దు దానయ్య, తదితరులు పాల్గొన్నారు.