
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపుర మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మోదీ సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా రామచంద్రపురం రూరల్ లో బిజెపి మండల అధ్యక్షుడు ఆకేటి శ్రీకృష్ణ, మండల కన్వీనర్, జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి తోలేటి సూర్య గంగాధర్ ఆధ్వర్యంలో స్వదేశీ వస్తువులు, చేనేత వస్త్రాలు వాడాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా యువమోర్చా అధ్యక్షుడు గాణాల కళ్యాణ్,ఇంచార్జ్ పాపారావు,కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, జిల్లా సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ నాగిరెడ్డి సతీష్ రావు తదితర బిజెపి నాయకులు చేనేత కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక, వారసత్వ కళ అని, చేనేత వస్త్రాలు వాడి ప్రోత్సహించాలని నాగిరెడ్డి సతీష్ రావు కోరారు.