
జనం న్యూస్: 03. అక్టోబర్ టేక్మాల్ ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి నియామకంపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపిన అధ్యక్షుడు నియామకం ( మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మండల నాయకులు కార్యకర్తలు ఆకాంక్షించారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేశారు. విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో టేక్మాల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత అభివృద్ధి చెందాలని నాయకులు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.
టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియామకమైన పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ - ఆందోల్ నియోజకవర్గం