
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జహీరాబాద్ నియోజకవర్గం జరాసంఘం, అక్టోబర్ 6. 10. 2026: జరాసంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ పేషెంట్లకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ కిట్లు అందజేసినట్లు టీబీ సూపర్ వైజర్ నాగరాజు తెలిపారు. ఆరు నెలల పాటు మందులు క్రమం తప్పకుండా వాడితే టీబీ పూర్తిగా నయమవుతుందని, ప్రతి నెల రోగులకు రూ.1000 పోషక భత్యం అందజేస్తున్నామన్నారు. రెండు వారాలకు మించి దగ్గు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి రమ్య, ఫార్మసిస్ట్ వెంకటేశం, ల్యాబ్ టెక్నీషియన్, సూపర్ వైజర్లు, ఆశాలు, సిబ్బంది పాల్గొన్నారు.