
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జహీరాబాద్, అక్టోబర్ 6.10.2026 మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో ఒక కుంటకు సంబంధించి మండల సర్వేయర్, ఇరిగేషన్ అధికారులు కలిసి సోమవారం నాడు జాయింట్ సర్వే నిర్వహించారు. గ్రామంలోని ఒక సామాజిక వర్గానికి చెందిన స్మశాన వాటికకు సంబంధించి రెండు వర్గాల మధ్య గత కొద్ది రోజులుగా వివాదం తలెత్తింది. గ్రామంలోని 178 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిలో ఒక సామాజిక వర్గం వారికి, అదే సామాజిక వర్గంలోని ఇతర కులస్థుల మధ్య స్మశాన వాటికకు సంబంధించి జరుగుతున్న వివాదంలో ఇరు వర్గాలవారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో 178 సర్వే నంబర్ భూమిలో ఉన్న ఈద్గా కుంట స్థలం, దాని శిఖం, మిగిలిన ప్రభుత్వ భూమికి సంబంధించి మండల సర్వేయర్ లాల్ సింగ్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రామారావు, ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ జానకిరామ్, వర్క్ ఇన్స్పెక్టర్ లు రఘు, జహీర్, సిబ్బంది మహబూబ్ అలీ, చోటు మియా, పాండు, ఆరిఫ్ లు కలిసి సంయుక్తంగా సర్వే జరిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా చిరాగపల్లి ఎస్ ఐ వినయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. సర్వే కు సంబంధించి ఒక వారం లోగా హద్దులను ఏర్పాటు చేయనున్నట్లు రెవిన్యూ అధికారులు పేర్కొన్నారు.