
జనం న్యూస్ 06 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ఆ లంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం లో మల్లమ్మకుంట రిజర్వాయర్ నష్టపరిహారం విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లమ్మకుంట రిజర్వాయర్ నష్టపరిహారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. ఎక్కువ పరిహారం ఇప్పిస్తాం అంటూ రైతుల వద్ద డబ్బులు వసూలు చేసే దళారులు, మధ్యవర్తులను నమ్మవద్దు. వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి అని అన్నారు. ఎవరైనా పరిహారం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేసినా వసూలు చేయడానికి ప్రయత్నించినా వారి పేర్లతో సహా ఆధారాలను పోలీసులకు అందించి ఫిర్యాదు చేయాలని సూచించారు. రైతులను మోసం చేస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే విజయుడు హెచ్చరించారు రైతుల నష్టపరిహారం రైతుల హక్కు దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ప్రతి రైతు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన పేర్కొన్నారు.