
రెండో రోజు పోటీల్లో ఆకట్టుకున్న వాలీబాల్ సెమీఫైనల్ మ్యాచ్లు.*
*క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని ఎస్ఐ రాజు సూచన*
*బిచ్కుంద, సెప్టెంబర్ 18 ( జనం న్యూస్):* కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడోత్సవాల్లో రెండో రోజు పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ముఖ్యంగా వాలీబాల్ సెమీఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగాయి. క్రీడా కారులు ప్రతిభను చాటుతూ పోటీపడ్డారు.ఈ సందర్భంగా బిచ్కుంద ఎస్ఐ రాజు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారుల ను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, విజయం సాధించిన వారు అతిగా ఆనందపడకుండా, ఓటమి చెందిన వారు నిరుత్సాహ పడకుండా క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, చేసిన తప్పులను గుర్తించి తదుపరి పోటీల్లో పునరావృతం కాకుండా కృషి చేయాలని తెలిపారు. గెలుపు కంటే క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యమని పేర్కొన్నారు.కార్యక్రమంలో రిఫరీ మహేష్ రాజుతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి జాదవ్ ఈశ్వర్ పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.