
నందలూరు, అక్టోబర్ 06, (ఎల్లో సింగం ప్రతినిధి) నందలూరు మండలంలోని ఆడపూరు గ్రామంలో ఉన్న అంబేడ్కర్ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి సొంత ఖర్చుల తో జెసిబి యంత్రాన్ని ఏర్పాటు చేసి శుభ్రం చేయిం చారు. విద్యా ర్థులు ఆడు కోవ డానికి, శారీరక వ్యాయామం చేయడానికివీలుగా మైదానాన్ని రూపుదిద్దడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడు తూపాఠశాల మైదానం పిచ్చి మొక్కలతో నిండిపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారని, ఈ సమస్యను గుర్తించి వెంటనే స్పందించి జెసిబి ద్వారా మైదానాన్ని శుభ్రం చేయించిన రాచూరి మురళికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతి నిధులు, ప్రముఖులు ఇలా ముందుకు రావడం అభినంద నీయమన్నారు.సమాజంలో విద్యార్థుల భవిష్యత్తు,వారి ఆరోగ్యకరమైన వాతావరణం కోసం రాచూరి మురళి నిరం తరం కృషి చేస్తున్నారని కొని యాడారు. క్రీడా మైదానం పరిశుభ్రంగా ఉండటం వల్ల విద్యార్థులు భయం లేకుండా క్రీడల్లో పాల్గొనవచ్చని పేర్కొ న్నారు.పాటూరు జెడ్పీ స్కూల్ చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు మాట్లాడుతూ:విద్యాసంస్థ ల సమస్యల పరిష్కారానికి స్పందించే గుణం రాచూరి మురళికి ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం అందరి బాధ్యత అని చెప్పారు.హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డ్రగ్స్ అండ్ క్రైమ్ జిల్లా చైర్మన్ వీరబల్లి జయకుమార్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో పరిశుభ్రత చాలా ముఖ్యమని, విషసర్పాలు, పిచ్చి మొక్కల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా మైదానాన్ని శుభ్రం చేయించడం ఎంతో శ్రేయస్కర మని అభిప్రాయపడ్డారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఏపీ స్టేట్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ జుల్ఫికర్, విద్యార్థుల క్షేమాన్ని కాంక్షించి, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదానం రీతిలో ఈ కార్య క్రమాన్ని చేపట్టిన రాచూరి మురళికి, సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలి పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.