
జనం న్యూస్ అక్టోబర్ 6ముమ్మిడివరం( గ్రంధి నానాజీ ) డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రూరల్ మండలం చినకొత్తలంక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఈరోజు బీజేపీ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు కొప్పిశెట్టి లావణ్య ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షలు రూరల్ మండల ఇంచార్జిగణిశెట్టి వెంకటేశ్వరరావు, సర్అసెంబ్లీకన్వీనర్ గొలకోటి వెంకటరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు అందుతున్న విద్య, పోషకాహారం, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషణకు అంగన్వాడీ కేంద్రాలు ఎంతో కీలకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు. అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు అందిస్తున్న సేవలను అభినందిస్తూ అంగన్వాడీ టీచర్లకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొత్తూరి మూర్తిరాజు, కిసాన్ మోర్చాసీనియర్ నాయకులు సత్యనారాయణరాజు, మండలకిసాన్ మోర్చా అధ్యక్షులు ముదునూరి సత్యనారాయణరాజు, భాస్కరవర్మ,కృష్ణంరాజు మరియు చిన్నారుల తల్లులు అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.