
బిచ్కుంద, అక్టోబర్ 07: జనం న్యూస్కా మారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర, IPS గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా ఈరోజు బిచ్కుంద స్థానిక డిగ్రీ కళాశాలలో ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిచ్కుంద ఎస్హెచ్ఓ రాజు విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు కుటుంబాలు మరియు సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి మరియు లక్ష్య సాధనపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈగల్ టీమ్‌కు చెందిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ రఘు విద్యార్థులకు డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, వాటికి బానిస కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సానుకూల ఆలోచనా విధానం మరియు లక్ష్య సాధనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అశోక్, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు, ఈగల్ టీమ్ సభ్యులు మరియు పోలీస్ సిబ్బంది సాయిబాబా, రాకేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం – యువత భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.