
జనం న్యూస్, అక్టోబర్ 07, అచ్యుతాపురం : వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు.అచ్యుతాపురం మండలం పూడి ఆర్అండ్ఆర్ కాలనీ వైస్సార్ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు డి. శంకర రావు, కె. లచ్చన్న నాయుడు (బుజ్జి ), లాలం రాంబాబు మరియు గ్రామ స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్న కార్యకర్తలకు గుర్తింపు కల్పించే ఉద్దేశంతో ఐడీ కార్డులను అందజేసినట్లు నాయకులు తెలిపారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అచ్యుతాపురం మండలం వైస్సార్ నగర్ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వైస్సార్సీపీ గ్రామ ప్రెసిడెంట్ రాజాన సంజీవ్ తెలిపారు. ప్రజా సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, గ్రామ అభివృద్దే తన ధ్యేయమని, రానున్న స్థానిక ఎన్నికలలో ప్రజలు తనకు మద్దతుగా నిలవాలని సంజీవ్ కోరారు.