
జనం న్యూస్ 07 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్అ త్యాశే మోసగాడి ఆయుధం అప్రమత్తతే మీ కవచం ఒక్క వ్యక్తి అప్రమత్తత ఒక్క కుటుంబాన్ని కాపాడితే ఒక్క కుటుంబం అప్రమత్తత ఒక్క గ్రామాన్ని కాపాడుతుంది సైబర్ నేరాలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాలి సైబర్ మోసాలపై అవగాహన పోస్టర్లను విడుదల చేసిన ఎస్పీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్ప్ర జల అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆగండి ఆలోచించండి ఆ తర్వాతే అడుగు వేయండు అనే జాగ్రత్తను ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ సూచించారు. ఒక్క వ్యక్తి అప్రమత్తత ఒక కుటుంబాన్ని కాపాడుతుందని, ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మార్గదర్శకాల మేరకు సైబర్ జాగృక్త దివాస్ లో భాగముగా అక్టోబర్ నెలను సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ మంత్‌గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సైబర్ మోసాల నివారణ ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైబర్ మోసాలపై అవగాహన పోస్టర్లను ఎస్పీ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తక్కువ పెట్టుబడికి అధిక లాభాలు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు లోన్ యాప్‌లు, ఆన్లైన్ షాపింగ్ ఆఫర్లు, లాటరీలు, అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ వంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటిపి, ఏటీఎం, పిన్, యూ.పి.ఐ. పిన్, పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, గుర్తుతెలియని లింకులపై క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.ఆగండి.. ఆలోచించండి.. ఆ తర్వాతే అడుగు వేయండి” అనే జాగ్రత్తను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఏదైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930కు ఫోన్ లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. సకాలంలో సమాచారం అందిస్తే మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు.అక్టోబర్ నెలంతా పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు బస్స్టాండ్లు, ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. సైబర్ నేరాల నివారణ కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండి కుటుంబ సభ్యులు స్నేహితులు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
పి. ఆర్. ఓ జిల్లా పోలీస్ కార్యాలయం, జోగుళాంబ గద్వాల్ జిల్లా.