
జనం న్యూస్ అక్టోబర్ 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ప్రజా జీవితంలో 25 సంవత్సరాలుగా అందిస్తున్న నిరంతర సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వికసిత్ భారత్ 2047 నిర్మాణ లక్ష్యంతో ప్రజలను ఏకం చేయాలనే సంకల్పంతో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గిరి వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “వికసిత్ భారత్ సేవా సంకల్ప సభ మరియు జ్యోతి యాత్ర” కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు నియోజకవర్గ బిజెపి నాయకులతో కార్యకర్తలతో పాల్గొన్నారు. శోభ గార్డెన్స్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవ దేశానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా దేశ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజల భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్ సంకల్పం సాకారం అవుతుందని వడ్డేపల్లి రాజేశ్వర రావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.