
గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి --ఇంచార్జీ సర్పంచ్ చాట్ల జనార్దన్
జనం న్యూస్, సెప్టెంబర్ 18: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గ్రామ పేదరిక నిర్మూలన ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, పేద కుటుంబాల సంక్షేమం, మహిళల భాగస్వామ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వినియోగం తదితర అంశాలపై గ్రామ ప్రజలకు, మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ సర్పంచ్ చాట్ల జనార్ధన్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మహిళా సంఘాల ప్రతినిధులకు ప్రతి ఒక్కరూ సహకరించి గ్రామ పేదరిక నిర్మూలన ప్రణాళికను విజయవంతం చేయాలని సూచించారు. గ్రామంలోని సమస్యలు, అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి బి. ప్రశాంత్, కారోబర్ సాయిరాం, మహిళా సంఘాల ప్రతినిధులు ఉత్కామ్ నవనీత, లింగాల లలిత, పిహెచ్ సీ శరణ్య, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉపాధ్యాయులు దోమకొండ అనురాధ, కట్కం గౌతమి, మాజీ జడ్పీటీసీ ఏనుగందుల అమిత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.