
జనం న్యూస్ అక్టోబర్ 8 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కొత్తూరు నర్సింగరావుపేట కార్పొరేషన్ 107వ వార్డులో నేషనల్ హైవే 16 కు వర్షాలకు నీరు వెళ్లే అవకాశం లేకపోవడంతో గతంలో 50 లక్షలతో కొత్తూరు నర్సింగరావుపేట నుండి కొప్పాక వరకు సిమెంట్ కాలువ నిర్మాణం చేశామని, ఇక్కడ ప్రజలు కాలువ దాటి వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరుగుచున్నయని శాసనసభ్యులు కొణతాల రామకృష్ణకు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పీలా గోవింద సత్యనారాయణ సిఫార్సులతో కాలవలపై స్లాబ్ నిర్మాణానికి 20 లక్షలు మంజూరు చేశారని, ఈరోజు ఉదయం తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు సమక్షంలో స్లాబులు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి పనులు ప్రారంభించమని తెలుగుదేశం పార్టీ 107 వార్డు ఇన్చార్జ్ మాదంశెట్టి నీలబాబు తెలియజేశారు. ఈ కాసిరెడ్డి సత్యనారాయణ (మాజీ సర్పంచ్) సిహెచ్ దుర్గాప్రసాద్, గొల్లవిల్లి అప్పారావు, కసిరెడ్డి అప్పలకొండ, సిహెచ్ రమణ, నడిపిన హరికృష్ణ, బల్లి నాగేంద్ర నాగేష్ వినోద్ కుమార్ ఈత గోపి లక్ష్మీనారాయణ శ్రీను బలిరెడ్డి హరి శివ బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు.//