
జనం న్యూస్, అక్టోబర్ 09, అచ్యుతాపురం: వుషు క్రీడలో అద్భుత ప్రతిభ కనబరిచిన అచ్యుతాపురం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంకు చెందిన 9వ తరగతి విద్యార్థిని వాసుపల్లి మాధవి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. అండర్-17 విభాగంలో 65 కిలోల బరువు కేటగిరీలో పాల్గొన్న మాధవి రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ విజయంతో పాఠశాలకు, అచ్యుతాపురం ప్రాంతానికి ఆమె గర్వకారణంగా నిలిచింది. మాధవి సాధించిన విజయంపై పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ జేఎల్ఆర్సివతి, పిఈటి బేబీ రాణి,పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.