
జనం న్యూస్ అక్టోబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మైలారం గ్రామంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎడునూతుల నిశిధర్ రెడ్డి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా ఇన్చార్జి ఆరుట్ల దశమంత రెడ్డి ఈ సందర్భంగా చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు.
అంగన్వాడీ టీచర్లు చిన్నారుల సంరక్షణ, పోషణ, విద్యాభివృద్ధి కోసం అందిస్తున్న సేవలను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా అంగన్వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో ప్రజాసేవకు మరింత ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తులో కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాయరాకుల మొగిలి, జిల్లా ఉపాధ్యక్షులు కోడెపాక స్వరూప,జిల్లా కౌన్సిల్ సభ్యులు కానుగుల నాగరాజ్,మంద సురేష్ మండల ఉపాధ్యక్షులు కోమటి రాజశేఖర్, కార్యదర్శి మేకుల సుమన్, పోలు మహేందర్, భూత్ అధ్యక్షులు వంగల భాస్కర్ రెడ్డి, మునుకుంట్ల చంద్రమౌళి, మూడేడ్ల పైడి, ముల్కనూరు వెంకటేష్, మంద మధు, పున్నం సాంబయ్య, కొంగరి సుధాకర్, బాసాని నవీన్, ఎర్ర రాకేష్,నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, మైలారం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.