
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్. జనం న్యూస్ అక్టోబరు 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పేదల సొంతింటి కలను ప్రజాప్రభుత్వం సాకారం చేస్తుందని భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోని మందారిపేట గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని లబ్ధిదారులు వల్లపు శోభ దిలీప్ కుటుంబంతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారికి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. అర్హులైన నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు నాణ్యమైన ఇళ్లను నిర్మించుకోవాలని తెలిపారు ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబానికి ఒక భద్రత, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.