
జనం న్యూస్ అక్టోబర్ 9 ముమ్మడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గున్నేపల్లిలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ లో భారతీయ జనతా పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్ల కోటి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఉచిత వైద్యం, జల్ జీవన్ మిషన్, ఉచిత బియ్యం, ఉజ్వల గ్యాస్, వాత్సల్య, విశ్వకర్మ యోజన, ముద్ర రుణాలు, జీవిత బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబ అభివృద్ధి ద్వారానే గ్రామ, దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. కరోనా సమయంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్యులు అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలి దేవర గంగాధర్ శివాజీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి బాబీ మాస్టర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.