
రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 మంది కార్మికులకు సన్మానం.. నగదు బహుమతుల అందజేత
జనం న్యూస్ అక్టోబర్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ రామకృష్ణ వీధిలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ అభివృద్ధికి నిరంతరం సేవలందిస్తున్న వివిధ శాఖల కార్మికులను ఘనంగా సన్మానించారు. దసరా పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది కార్మికులకు సన్మానం చేసి నగదు బహుమతులు అందజేశారు. కాలనీ ప్రజల మధ్య కార్మికులను గౌరవించడం, వారి సేవలను గుర్తించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది.ఐదేళ్లుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమం
ఈ సందర్భంగా రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా కాలనీలో పనిచేస్తున్న వాచ్మెన్లు, పారిశుద్ధ్య కార్మికులు, వీధి దీపాల నిర్వహణ సిబ్బంది, వాటర్ వర్క్స్, డ్రైనేజీ, విద్యుత్ శాఖలకు సంబంధించిన కార్మికులను అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించి నగదు బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నా మని పేర్కొన్నారు. కాలనీలో కార్మికులు అందిస్తున్న సేవల వల్లే పరిశుభ్రత, సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు కాలనీకి మంచి పేరు ప్రతిష్ఠలు వస్తున్నాయని ఆయన అన్నారు. “కార్మికులే మా కాలనీకి బలం.. కాలనీవాసులే మా బలగం” అనే భావనతో ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నామని తెలిపారు.సుమారు 40 సంవత్సరాలుగా కాలనీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని, ఇందుకు సహకరిస్తున్న కమిటీ సభ్యులు, కాలనీవాసులు, కార్మికుల కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఐకమత్యంతోనే కాలనీ అభివృద్ధిఅసోసియేషన్ కార్యదర్శి రామచంద్రరావు మాట్లాడుతూ.. కాలనీవాసులు, కార్మికుల పరస్పర సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించ గలుగుతున్నామని అన్నారు. కార్మికుల కష్టాన్ని గుర్తించి వారిని గౌరవించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ అందరి సహకారంతో కాలనీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు.ఘనంగా నిర్వహించిన కార్యక్రమం ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు చెంగల్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీధర్, జి. ప్రసాద్, సూర్యనారాయణ, కిషోర్, నారాయణ సింగ్‌తో పాటు కార్మికులు కుమార్, జవాన్, నాగరాజు, విజయ్ చారి, శ్రీనివాస్, యాకయ్య, అనసూయమ్మ, వెంకటమ్మ, ఆటో సురేష్, శీను, టైగర్ శీను, భాస్కర్, చల్లారావు తదితరులు పాల్గొన్నారు. సుమారు 100 మంది హాజరైన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులకు, కమిటీ సభ్యులకు, కాలనీవాసులకు అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ చేతులెత్తి నమస్కరించారు.