
జనం న్యూస్ అక్టోబర్ 12, (పరిగి నియోజకవర్గం ఇచ్చార్జ్ ) వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఆశా వర్కర్ల సమావేశానికి అనుమతి లేదంటూ నాయకుల మరియు మరియు ఆశ వర్కర్ల అరెస్టు.. పోలీస్ స్టేషన్లో పరామర్శించిన మాజీ ఎమ్మెల్యేలు
ఆశా వర్కర్ల హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొడంగల్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతున్న బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు, ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషాలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అరెస్టయిన నాయకులను, ఆశా వర్కర్లను పరామర్శించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కొడంగల్‌లోని ఒక ఫంక్షన్ హాల్లో ఆశా వర్కర్లు తమ సమస్యలు, హక్కులపై చర్చించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి అనుమతి లేదంటూ నాయ కులను అరెస్టు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.మహిళలను కోటీశ్వరులను చేశానని గొప్పలు చెప్పుకుం టున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు తమ న్యాయమైన హక్కుల కోసం గొంతెత్తుతున్న ఆశా వర్కర్లను ఎందుకు నిర్బంధిస్తున్నారని ప్రశ్నించారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించా ల్సింది పోయి, వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వా మ్యానికి విరుద్ధమని విమర్శించారు.ఆశా వర్కర్లు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలని, అరెస్టు చేసిన నాయకులపై నిర్బంధ వైఖరిని విడనాడాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.