
జనం న్యూస్ అక్టోబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి సిసి రోడ్లు, డబ్ల్యూబిఎం రోడ్లు, డ్రైన్ పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కాట్రేనికోన మండలంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ గ్రామాల్లో రహదారులను ప్రారంభించడంతో పాటు నూతనంగా మంజూరైన పనులకు శంకుస్థాపనలు చేశారు. గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మెరుగైన రహదారులు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పల్లంకుర్రు గ్రామంలో రూ.80.50 లక్షలతో రహదారి పనులు: లైన్ పేటలో సాపే వెంకటరమణ ఇంటి నుంచి ఇసుకపట్ల అంబేద్కర్ ఇంటి వరకు సిసి రోడ్డు – రూ.25 లక్షలు, ఐ.చెరువు ప్రాంతంలో ఆర్ అండ్ బి రోడ్డు నుంచి సైక్లోన్ షెల్టర్ వరకు సిసి రోడ్డు – రూ.30.50 లక్షలు, విత్తనాల కాలువగట్టు ప్రాంతంలో సిసి రోడ్డు – రూ.25 లక్షలు. కందికుప్ప గ్రామంలో రూ.34.50 లక్షలతో సిసి రోడ్లు: రాజులరియా సిసి రోడ్డు నుంచి మేకల బ్రహ్మానందం ఇంటి వరకు – రూ.9.50 లక్షలు, సాలెం చంద్రావతి ఇంటి నుంచి గుత్తుల నాగేశ్వరరావు ఇంటి వరకు – రూ.3.50 లక్షలు, గజింతిప్పలో పలసాని నరసింహారావు ఇంటి నుంచి గుత్తుల శ్రీనివాస్ చెరువు వరకు – రూ.21.50 లక్షలు. అలాగే కందికుప్పలో వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. పల్లం గ్రామంలో వాటర్ ట్యాంక్, టిడిపి జెండా దిమ్మ ప్రారంభం: పల్లం గ్రామంలో వాటర్ ట్యాంక్, నూతన టిడిపి జెండా దిమ్మను ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. దొంతికుర్రు గ్రామ పరిధిలో రూ.89.35 లక్షలతో రహదారి పనులు: గిద్దివారిపేటలో కాశి నాగేశ్వరరావు ఇంటి నుంచి గిద్దె వేమకృష్ణ ఇంటి వరకు డబ్ల్యూబిఎం రోడ్డు – రూ.11.40 లక్షలు, కొత్తల చెరువులో కాగిత గంగిశెట్టి ఇంటి నుంచి ఏటిగట్టు వంతెన వరకు డబ్ల్యూబిఎం రోడ్డు – రూ.13.95 లక్షలు, దొంతికుర్రులో కాశి సహదేవుడు ఇంటి నుంచి జొన్నాడ రమేష్ బాబు ఇంటి వరకు డబ్ల్యూబిఎం రోడ్డు – రూ.28 లక్షలు, దులవరిపేటలో రేవు తిక్కన్న ఇంటి నుంచి పచ్చిమాల సింహాద్రి ఇంటి వరకు సిసి రోడ్డు – రూ.11 లక్షలు, మర్లచెరువులో ఎంపిపి పాఠశాల నుంచి జొన్నాడ రమేష్ ఇంటి వరకు సిసి రోడ్డు – రూ.25 లక్షలు. కాట్రేనికోనలో రూ.50 లక్షలతో సిసి రోడ్డు కమ్ డ్రైన్: కాట్రేనికోన మార్కెట్ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం నుంచి సుబ్బరాయుడు ఆలయం వరకు సిసి రోడ్డు కమ్ డ్రైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో టిడిపి మండల అధ్యక్షులు చెల్లి సురేష్, టిడిపి జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, నాగిడి నాగేశ్వరరావు, నడింపల్లి సుబ్బరాజు, దాట్ల పవన్, ఆకాశం శ్రీను, చీకరిమిల్లి వెంకటేశ్వరరావు, విలేకరి రాజు, సత్యం, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇట్లు, శాసనసభ్యుల కార్యాలయం, మురమళ్ల.