
మార్కెట్ కమిటీ చైర్మన్ పరుశురాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జనం న్యూస్ అక్టోబర్ 13, (పరిగి నియోజకవర్గం ఇంచార్జ్ ) వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం, రాష్ట్రంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న రాయితీ నూనె గింజల విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పరుశురాం రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు . జాతీయ నూనె గింజలు మిషన్ పథకం కింద స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 50 శాతం రాయితీ శనిగలు 100% రాయితీ వేరుశనగ విత్తనాలు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ మిషన్ ద్వారా రైతులు సంప్రదాయ సాగు పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతికను ఉపయోగించుకోవాలని వేరుశనగ సాగులో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి పంతులు, కుల్కచర్ల ఏఎంసి చైర్మన్ ఆంజనేయులు, కులక్చర్ల పిఎసిఎస్ చైర్మన్ భీమిరెడ్డి, పరిగి దోమ మండలాల వ్యవసాయ అధికారులు రజిత, ప్రభాకర్ రెడ్డి, ఏ ఈ ఓ లు ఆయా గ్రామాల రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.