జనం న్యూస్ 13 అక్టోబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని వెంగళాయిపేట గ్రామంలోని భవన నిర్మాణ కార్మికులు తమ సంఘానికి ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికుల భవనం కోసం రెండు గుంటల భూమి కేటాయించాలని, 15 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు.
దీనికి స్పందించిన మంత్రి పెగడపెల్లి ఎమ్మార్వో నిజాముద్దీన్ కి ఆ విషయాన్ని తెలియజేశారు. ఈరోజు ఎమ్మార్వో గ్రామానికి వచ్చి భూమి పరిశీలన నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోకెనపల్లి గోపాల్ ఎమ్మార్వో నిజాముద్దీన్ ఆర్ఐ జమున , ఆర్ఐ శ్రీనివాస్ – జిపిఓ అజముద్దీన్ సర్వేయర్ తనుజ రాణి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడారి తిరుపతి వార్డు సభ్యులు ఐతరవేణి గంగాధర్, తోట గంగయ్య భవన నిర్మాణ కార్మికుల అధ్యక్షులు రాచర్ల నరేష్, కార్మికులు రవి, జలంధర్ మాజీ అంబేద్కర్ ప్రెసిడెంట్ సుంకె ప్రకాశ్, రామంచె నర్సయ్య, శ్రీరాం పోచయ్య పాల్గొన్నారు. మంత్రి కి వెంటనే చర్యలు తీసుకుని ప్రభుత్వ స్థలంలో రెండు గుంటల భూమి కేటాయించడానికి అంగీకరించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.