
జనం న్యూస్ - అక్టోబర్ 14, (పరిగి నియోజకవర్గ ఇన్చార్జి )వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని జెడ్ పి హెచ్ ఎస్ నెంబర్ వన్ పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా ఎంపిక చేయడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. ₹10 కోట్లతో అభివృద్ధి: ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాఠశాలకు ₹1,000 లక్షలు (₹10 కోట్లు) అంచనా వ్యయంగా పేర్కొన్నారు.- ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్య: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవకాశం. ఆధునిక మౌలిక సదుపాయాలు: మెరుగైన విద్యా వాతావరణం, ఆధునిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత.- ప్రజా ప్రభుత్వానికి అభినందనలు: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలు అభినందనీయం. అన్నారు. ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ: “పరిగి నియోజకవర్గ విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. పరిగి జెడ్పీహెచ్ఎస్ నం.1 పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయడం విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభవార్త అన్నారు. నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు.