
జనం న్యూస్ అక్టోబర్ 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ జన్మదిన వేడుకలను గురువారం (అక్టోబర్ 15) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, వివిధ కమిటీల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. వివేకానంద నగర్లోని సప్తగిరి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వేదికగా గురువారం ఉదయం 8 గంటల నుంచి జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్న నేపథ్యంలో వేడుకలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు, వివిధ కమిటీల సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలకు మరింత శోభ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వేదిక: ఎమ్మెల్యే కార్యాలయం, సప్తగిరి కాలనీ, వివేకానంద నగర్.