
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం అక్టోబర్ 14. 10. 2026 జహీరాబాద్ నియోజకవర్గం జర సంఘం మండలం గిన్నెరుపల్లి గ్రామం లో గ్రామ ప్రజలకు నీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ జలమోత్సవం నిర్వహణ గినియార్పల్లి గ్రామంలో సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్ ఆధ్వర్యంలో జలమోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు నీటి ప్రాముఖ్యత, నీటి సంరక్షణ, ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. నీరు మానవ జీవితానికి ఎంతో కీలకమని, భవిష్యత్తు తరాలకు కూడా నీటి కొరత లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా వివరించారు. గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడం, నీటిని వృథా కాకుండా చూడడం, నీటి వనరులను పరిరక్షించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారి మౌనిక మేడం, పంచాయతీ కార్యదర్శి రాజు, గ్రామపంచాయతీ సిబ్బంది, మిషన్ భగీరథ సిబ్బంది హరీష్, లక్ష్మణ్తో పాటు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న తాగునీటిని బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామంలో నీటి సమస్యలు తలెత్తకుండా ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. జలమోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నీటి సంరక్షణపై మరింత అవగాహన పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేస్తూ నీటి వనరులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సంబంధిత శాఖల సిబ్బంది, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని జల సంరక్షణకు తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.