జనం న్యూస్ 14 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో రైతంగానికి నాణ్యమైన విద్యుత్ రోజుకు 18 గంటలు కరెంటుని ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సిపిఐ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ మాట్లాడుతూ వర్షాలు రాక పెట్టిన పంట పొట్టకు వచ్చిన టైంలో నీరు అందక పొలాలు ఎండిపోతున్న రైతులు చూసి బాధపడుతున్న పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతాంగానికి కరువు నిధులను విడుదల చేయాలని రైతులను ఆదుకోవాలని పంట పొలాలకు నష్టపరిహారం అందించే విధంగా స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ స్థానిక అధికారులందరూ రైతు పక్షాన నిలిచి భరోసా కల్పించవలసినటువంటి అవసరం ఉన్నదని అన్నారు లేనియెడల ఇదేవిధంగా కరెంటు సక్రమంగా ఇవ్వకపోతే రైతులను చైతన్యపరచి కరెంటు కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య,మండల కార్యవర్గ సభ్యులు కందుల మధు, రైతు నాయకులు గిరబోయిన స్వామి, గుండె బాలరాజు, గ్యాద పాక కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.