
శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసిన రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురంధర్ రెడ్డి జనం న్యూస్ అక్టోబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురంధర్ రెడ్డి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేసి, స్వీట్లు తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనంపల్లి పురంధర్ రెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండడం అభినందనీయమని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ, ప్రజలతో మమేకమై పనిచేస్తున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలని జనంపల్లి పురంధర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జి. నర్సింగరావు, సూర్యనారాయణ, ఉత్తమ్ చౌదరి, కోఆపరేటివ్ చైర్మన్ రామారావు, లక్ష్మీనారాయణ, గ్రానైట్ సూర్యనారాయణ, నాని తదితరులు పాల్గొని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.