తెలంగాణ

శ్రీ దుర్గా రాఘవేంద్ర కాలనీలో ఘనంగా శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు

శ్రీ దుర్గా రాఘవేంద్ర కాలనీలో ఘనంగా శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు

జనం న్యూస్ అక్టోబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కైతలాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ఉ త్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలు భక్తిభావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, ఏఎంసీ వైస్ చైర్మన్ ప్రకాష్ ముదిరాజ్, మూసాపేట్ యూత్ కాంగ్రెస్ నాయకుడు అమీర్, స్థానిక నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్