ఆంధ్రప్రదేశ్

బీజేపీ ఫతేనగర్ డివిజన్ అధ్యక్షులు రాధే శ్యామ్, ఓబీసీ మోర్చా కో-కన్వీనర్ కాంచి శివలకు అభినందనలు

బీజేపీ ఫతేనగర్ డివిజన్ అధ్యక్షులు రాధే శ్యామ్, ఓబీసీ మోర్చా కో-కన్వీనర్ కాంచి శివలకు అభినందనలు

జనం న్యూస్ అక్టోబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బీజేపీ ఫతేనగర్ డివిజన్ అధ్యక్షులుగా రాధే శ్యామ్, కూకట్‌పల్లి అసెంబ్లీ ఓబీసీ మోర్చా కో-కన్వీనర్‌గా కాంచి శివ బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారికి బీజేపీ అగ్రనేతలు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శేఖర్ యాదవ్‌తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు కాంచి మహేందర్ సమక్షంలో రాధే శ్యామ్, కాంచి శివలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు వారు మరింత అంకితభావంతో కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

ఇ-పేపర్