జేసీబీ సాయంతో శుభ్రత పనులు చేపట్టిన రెండు గ్రామాల ప్రజలు జనం న్యూస్, అక్టోబర్ 15: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్, దోమ్చందా గ్రామాల పరిధిలోని చెరువులు, కుంటలకు డి-19 కాలువ ద్వారా నీరందించేందుకు గురువారం గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో శుభ్రత పనులు చేపట్టారు. రెండు గ్రామాలకు చెందిన వివిధ సంఘాల సభ్యులు ఐక్యంగా ముందుకు వచ్చి జేసీబీ సాయంతో కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు.
కాలువలో చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకాలు కలగకుండా, చెరువులు, కుంటలకు నీరు సజావుగా చేరేలా ఈ చర్యలు చేపట్టారు. గ్రామస్తులు సమిష్టిగా కృషి చేస్తూ కాలువను శుభ్రం చేయించారు. నీటి వనరులకు నీరందించి రైతులకు, గ్రామ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాళ్ల రాంపూర్ ఇన్చార్జి సర్పంచ్ చాట్ల జనార్దన్, మాజీ దోంచందా గద్దె గంగారాం తో పాటు రెండు గ్రామాలకు చెందిన వివిధ సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.