జనం న్యూస్ అక్టోబర్ 16 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, గురువారము బీబీపేట్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్తి సంబంధిత నేరాల నివారణ గ్రామాల్లో దొంగతనాలు, ఇతర ఆస్తి సంబంధిత నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి నిరంతర గస్తీ నిర్వహణ ముఖ్యమైన ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై నిఘా పెట్టాలని
112 అత్యవసర కాల్స్కు తక్షణ స్పందన డయల్ 112 ద్వారా వచ్చే అత్యవసర కాల్స్కు వెంటనే స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తగిన సహాయం అందించాలని దొంగతనం కేసుల త్వరితగతిన ఛేదన దొంగతనం కేసులను త్వరితగతిన ఛేదించి, నిందితులను గుర్తించి పట్టుకుని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని
విధుల నిర్వహణలో మెరుగైన పనితీరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ మెరుగైన పనితీరును కనబరచాలి. పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత పోలీస్ స్టేషన్ ఆవరణను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర, పోలీస్ సిబ్బందికి చెప్పారు.