ఆంధ్రప్రదేశ్

గౌరీ సేవా సంఘం నాటకోత్సవాల సందర్భంగా అమ్మోయమ్మ మా దుర్గమ్మ పాట విడుదల

గౌరీ సేవా సంఘం నాటకోత్సవాల సందర్భంగా అమ్మోయమ్మ మా దుర్గమ్మ పాట విడుదల

జనం న్యూస్ అక్టోబర్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కనకదుర్గమ్మ వారి శతకం పట్టు దసరా నవరాత్రుల సందర్భంగా గౌరీ సేవా సంఘం ఓపెన్ ఆడిటోరియంలో కర్రి రమేష్ మెమోరియల్ ఆర్థిక సహాయంతో ఉభయ తెలుగు ఆహ్వాన నాటక ప్రదర్శనలు చివర రోజున కనకదుర్గ అమ్మవారిపై బొడ్డేడ మురళి అమ్మోరమ్మ మా దుర్గమ్మ అనే పాటకు రచన స్వరకల్పన చేసిన పాటను ముఖ్య నాయకుల కొణతాల వెంకటరావు కాండ్రేగుల సత్యనారాయణ కర్రి సన్యాసినాయుడు బొడ్డేడ మురళి, కొణతాల మురళీకృష్ణ కే యం నాయుడు, బొడ్డేటి శివ మాజీ కౌన్సిలర్ కే యం నాయుడు కొణతాల బాబురావు మల్ల సూరిబాబు అమ్మోరమ్మ మా దుర్గమ్మ బ్రోచర్ లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల వెంకటరావు మాట్లాడుతూ నాటకాలకు ఆదరణ ఈనాటిది కాదని 60 సంవత్సరాల క్రితమే గవరపాలెం ప్రాంతంలో గౌరీనాట్యమండలి శారద నాట్యమండలి భోగలింగేశ్వర నాట్యమండలి, డైమండ్ హిట్స్, నాటక రంగానికి జీవం పోసారని, సమాజంలో జరిగే ప్రతి సంఘటన నాటక రూపంలో ప్రజల ముందు ఉంటుందని, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో కర్రి రమేష్ మెమోరియల్ అధినేత కర్రి సన్యాసినాయుడు ఆర్థిక సహాయంతో గత 9 సంవత్సరాలుగా నిరంతరం నాటకాన్ని బ్రతికిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు ఈ సందర్భంగా వెంకటరావు తెలియజేశారు. కళాకారులు ఎక్కడో ఉండరని సమాజం నుండే పుట్టుక వస్తారని నాటకాలు వేసే ప్రతి వ్యక్తి కూడా నాటక సమాజం పట్ల విశ్వాసం నమ్మకం ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలనే ఆలోచనతో వివిధ ప్రాంతాల్లో పరిషత్తుల్లో పాల్గొని ప్రేక్షకులను మెప్పిస్తుంటారని, ఇటువంటి వారిని ప్రోత్సహించి, ప్రతిచోట ప్రదర్శించడానికి రాతల ముందుకు వచ్చినప్పుడే నాటక రంగానికి జీవం వస్తుందని భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ అన్నారు.//

ఇ-పేపర్