
జనం న్యూస్ అక్టోబర్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ నియామకమైన సందర్భంగా, నూతన అధ్యక్షులు జి. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు నూతన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కాలనీ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి, కాలనీలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ, కేపీహెచ్బీ 9వ ఫేజ్ కాలనీ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. కాలనీలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, త్వరలోనే కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని తెలిపారు.కాలనీ అభివృద్ధి కోసం నూతన కమిటీ సమష్టిగా కృషి చేయాలని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అనంతరం కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పరస్పరం ఆప్యాయంగా సంభాషించారు. ఈ కార్యక్రమంలో కెపిహెచ్బి కంటెస్టెంట్ కార్పొరేటర్ ప్రీతం రెడ్డి, కమిటీ సభ్యులు కే రాహుల్, కే చంద్రమోహన్ రెడ్డి, ఏం వీర గోవిందరావు, ఎన్ తిలక్ కుమార్, కృష్ణార్జున రెడ్డి,ఆర్. ఈశ్వర్ రెడ్డి, పీవీ సత్యనారాయణ, యాదిరెడ్డి, వై వెంకటరత్నం, విజయ్ కుమార్, నాగేశ్వరరావు, రామకృష్ణ రాజు, మధుసూదన్ రెడ్డి, చారి, నందయ్య, బాబురావు, బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు