
జనం న్యూస్ అక్టోబర్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని రావణ వధ ఉత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 20న నిర్వహించనున్న వేడుకలకు సామల గ్రౌండ్ను సిద్ధం చేసే పనుల్లో శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా-రవిపాల్,ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్ నిమగ్నమయ్యారు రావణ వధ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ట్రాక్టర్డోజర్ సహాయంతో గ్రౌండ్ను చదును చేయించారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు అనువుగా ఉండేటట్లు మైదానాన్ని తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనేలా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు చిందం సాయి, శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి, వార్డు సభ్యులు చెల్పూరి బంటి,మార్త ప్రవళిక-సాయి, బాసాని వినయ్,వినీత్, తట్ల సాయి,మోరె సందీప్ తదితరులు పాల్గొన్నారు.