
జనం న్యూస్ అక్టోబర్ 17, ( పరిగి నియోజకవర్గ ఇన్చార్జి హనుమంత్ రెడ్డి ) వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరో రోజు అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్ఞానానికి, విద్యకు ప్రతీక అయిన సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించ డంతో పాటు మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.అలాగే చిన్నారుల చే భరత నాట్యం భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టి, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు,మహిళా భక్తులు,చిన్నారులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, ఫిరంగి వెంకట్ రెడ్డి, జనగాం శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నాయకులు సురేష్ బాబు, బిజెపి వికారాబాద్ జిల్లా కోకన్వీనర్ అనూష బాబ్జి, కరీం పట్టణ మహిళా అధ్యక్షురాలు కావలి లక్ష్మి, మాజీ జెడ్పిటిసి హరిప్రియ రెడ్డి, చాలామంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.